ఆ సినిమా అయిష్టంగానే చేశా..

  • In Film
  • November 19, 2019
  • 141 Views
ఆ సినిమా అయిష్టంగానే చేశా..

సైరా నరసింహారెడ్డి చిత్రంతో దర్శకుడు సురేందర్‌ రెడ్డికి జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది.సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించే తదుపరి చిత్రంపై ఆసక్తి నెలకొన్న తరుణంలో 2006లో ఎన్టీఆర్‌తో తెరకెక్కించిన అశోక్‌ చిత్రంపై సురేందర్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి.అతనొక్కడే చిత్రం అనంతరం ప్రభాస్‌తో సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటుండగా అప్పటి ఎన్టీఆర్ మేనేజర్ రోజూ తన వెంటపడి ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి ఒప్పించాడని చెప్పాడు. తాను ఏ విషయం చెప్పకుండానే సినిమా ఎలా చేయాలి, ఎక్కడ చేయాలనే విషయాలు మాట్లాడడంతో తనకు ఇబ్బందికరంగా అనిపించినా.. ఎన్టీఆర్ వంటి పెద్ద హీరోతో సినిమా చేయకపోతే ఏం జరుగుతుందనే ఆలోచనతో  ఇష్టంలేకుండానే సినిమా చేయడానికి అంగీకరించినట్లు చెప్పుకొచ్చాడు.అలా ‘అశోక్’ కథ తన చేతుల్లో పెట్టారని అశోక్’ కథ తనకు సెట్ కాదని అనిపించిందా.. సినిమా చేయక తప్పని పరిస్థితుల్లో చేసినట్లుగా వెల్లడించాడు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos