న్యూ ఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రెండో రోజైన మంగళ వారం ఉభయసభల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. లోక్సభ ప్రారంభం కాగానే జేఎన్యూ వివాదంపై విపక్ష పార్టీలు వాయిదా తీర్మానం ఇచ్చాయి. సోనియా గాంధీ, రాహుల్గాంధీకి ఎస్పీజీ భద్రత తొలగింపుపై కాంగ్రెస్ పార్టీ సభ్యులు వాయిదా తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. అనంతరం పలు అంశాలపై విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు.సభ మధ్య భాగంలోకి కెళ్లి నినాదాలు చేశారు. ప్రతిపక్షాల నిరసనల నడుమే లోక్సభలో ప్రశ్నోత్త రాల్ని చేపట్టారు. రాజ్య సభలోనూ ఆందోళనలు వెల్లు వెత్తాయి. జేఎన్యూ వివాదం, కశ్మీర్ అంశం, మార్షల్స్ డ్రెస్కోడ్పై ప్రతి పక్ష సభ్యులు నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయు డు సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.