దాదాపు 12 ఏళ్ల తర్వాత తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘యమదొంగ’ సినిమాను తమిళంలోకి అనువదిస్తున్నారు. 2007లో వచ్చిన ఈ సినిమాలో ప్రియమణి, మమతా మోహన్దాస్లు కథానాయికలుగా నటించారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించగా, కీరవాణి స్వరాలు సమకూర్చారు. తెలుగులో విజయం సాధించిన ఈ సినిమాను ఇప్పుడు తమిళంలో ‘విజయన్’గా అనువదిస్తున్నారు. సుదిక్ష ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.బాహుబలి అనంతరం రాజమౌళి పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతుండడం ఎన్టీఆర్ సైతం జాతీయస్థాయిలో గుర్తింపున్న హీరో కావడంతో వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన యమదొంగ చిత్రాన్ని తమిళంలో అనువదించి విడుదల చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు..