వచ్చే నెల్లో శివసేన సర్కారు ఖాయం

వచ్చే నెల్లో శివసేన సర్కారు ఖాయం

ముంబై: మహారాష్ట్ర రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. శివసేన,ఎన్సీపీ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని అందరూ భావిస్తుండగా ప్రభుత్వ ఏర్పాటుకు చర్చలే జరగలేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ షాక్ ఇచ్చారు. శరద్ పవార్ తీరుపై తమకు ఎలాంటి అనుమానం లేదని శివసేన సీనియర్ నేత సంజయ్ రావత్ పేర్కొన్నారు. డిసెంబరు మొదటి వారంలో శివసేన ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడుతుందని పునరుద్ఘాటించారు. శరద్ పవార్ నేతృత్వంలో తాము త్వరలోనే ప్రధాని నరేం ద్ర మోదీని కలిసి రైతుల సమస్యలను గురించి వివరిస్తామన్నారు. తాము ఎన్సీపీ, కాంగ్రెస్ తో చర్చలు జరుపు తున్నం దునే ఎన్డీఏ నుంచి శివసేనను తొలగించిందుకు భాజపాపై సామ్నాలో శివసేన విమర్శల్ని గుప్పించింది. శివసేన వ్యవస్థాపకు డు బాల్ థాకరే ఏడో వర్థంతి సందర్భంగా ఆయనకు దేశం మొత్తం నివాళులు అర్పిస్తున్నవేళలో భాజపా ఇలాంటి నిర్ణయాన్నితీసుకోవడంతో ఆ పార్టీ తీరు ఏంటో స్పష్టమైందని తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos