శబరిమలకు వెళుతున్న భక్తులపై విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి మురళీధరన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.శబరిమలకు వెళుతున్న భక్తులను అర్బన్ నక్సల్స్ అని వారంతా అరాచకవాదులని నాస్తికులంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాళ్లు నిజమైన భక్తులా కాదా అని తెలియాలంటే కొండపైకి వచ్చే వారిని విచారణ చేయాలని డిమాండ్ చేశారు.శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నామని చెప్పుకునేందుకే భక్తుల పేరుతో ఆలయంకు వెళుతున్నారనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉంటే గతేడాది స్వామి దర్శనానికి వచ్చిన కొంతమంది మహిళా భక్తులకు కేరళ ప్రభుత్వం భద్రత కల్పించింది. కానీ ఈ సారి మాత్రం భద్రత కల్పించేది లేదంటూ తెగేసి చెప్పేసింది..