పాత్ర కోసం ఎంతటి సాహసానికైనా వెనకడుగేయని నటుల్లో బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ అందరికంటే ముందుంటాడు.కథ నుంచి పాత్రల తీరుతెన్నులు,ఆహార్యం వరకు ప్రతి ఒక్కటి పర్‌ఫెక్ట్‌గా ఉండాలని తాపత్రయ పడే ఆమీర్ ఇది వరకు నటించిన చిత్రాల్లో పాత్రల కోసం ఎంత కష్టపడ్డాడో తెలిసిందే.తాజాగా మరోసారి చిత్రంలో పాత్ర కోసం గుర్తు పట్టలేనంతగా తయారయ్యాడు.ఫారెస్ట్ గంప్ అనే హాలీవుడ్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్దా చిత్రం కోసం పూర్తిగా సిక్కు అవతారంలోకి మారిపోయాడు. ఫార్మల్ డ్రెస్ లో ఏదో ఎగ్జయిట్ మెంట్ తో కనిపిస్తున్నాడు లాల్ సింగ్. తన చేతిలో ఓ గిఫ్ట్ ప్యాక్ సిక్కు పాత్రలో ఒదిగిపోయాడు..