కత్తి పట్టిన స్మృతీ ఇరానీ..

కత్తి పట్టిన స్మృతీ ఇరానీ..

గుజరాత్ సంప్రదాయ నృత్యమైనతల్వార్ రాస్ను తనదైన శైలిలో ప్రదర్శించిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కాసేపు సందడి చేశారు. భావ్ నగర్లో స్వామి నారాయణ్ గురుకుల్ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమం సందర్భంగా, స్టేజ్ పైకి ఎక్కన ఆమె, రెండు చేతులతో కత్తులు పట్టుకుని, డ్యాన్స్ చేశారు. తనతో పాటుతల్వార్ రాస్ప్రదర్శిస్తున్న చిన్నారులను చూసిన ఆమె వారిని అనుకరిస్తూ నృత్యం చేయగా, దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కేంద్ర జౌళి, మహిళా శిశు సంక్షేమ మంత్రిగా పనిచేస్తున్న స్మతి ఇరానీ, కార్యక్రమంలో చాలాసేపు పాల్గొని, చిన్నారులతో గడిపారు. కాగా, గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాల్లోతల్వార్ రాస్కు మంచి ఆదరణ ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos