నగరి: శాసనసభ్యురాలు ఆర్.కె.రోజా సెల్వమణి నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహితంగా మలిచేందుకు ప్లాస్టిక్కు బియ్యం పథకాన్ని ప్రవేశ పెట్టారు. కిలో ప్లాస్టిక్ వ్యర్థాలు తెచ్చి కిలో బియ్యం తీసుకు వెళ్లాలని ఆమె సామాజిక మాధ్యమాల ద్వారా విన్నవించారు. ప్రతి మున్సిపాలిటీ, పంచాయతీ, వార్డు ప రిశుభ్రంగా ఉంచేందుకు ప్లాస్టిక్ను ఏరి వేయాలని కోరారు. ‘స్వచ్ఛ నగరి’ నియోజకవర్గాన్ని సాధించి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం, అందరికీ ఆదర్శంగా నిలుద్దాం అని ఆశించారు.