అనంతపురం: తెదేపా నేత జేసీ దివాకర్ రెడ్డి మాజీ వ్యక్తిగత సహాయకుడు సురేష్ ఇంటి పై శుక్రవారం అవినీతి నిరోధక శాఖ అధికార్లు దాడి చేసారు. ఉదయం నుంచి సోదాలు ప్రారంభించారు. మధ్యాహ్నం వరకూ వరకూ రూ.నాలుగు కోట్లు విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. పంచాయవతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా సురేష్ పని చేస్తున్నాడు. దివాకర రెడ్డి పదవిలో ఉన్నా లేక పోయినా ఆయనకు సురేష్ సేవలు అందించారు. దివాకర రెడ్డిని అడ్డం పెట్టుకుని ఆదాయానికి మించి ఆస్తులు ఆర్జించాడని సురేష్ కు వ్యతిరేకంగా పలువురు ఏసీబీకి ఫిర్యాదు చేసారు. డీఎస్పీ నాగభూషణం నేతృత్వంలో తని ఖీ లు నిర్వహిస్తున్నారు. అనంతపురం, పుట్టపర్తి, బేతంచర్ల ప్రాంతాల్లో సురేష్ కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లపై కూడా దా డు లు జరుగుతున్నాయి. సోదాల పూర్తి వివరాలు అధికారులు శుక్రవారం విలేఖరులకు వెల్లడిస్తారని తెలుస్తోంది.