భారత సైనికులకు పెట్టే ఆహారం నాసిరకంగా ఉందని.. దానిని తినలేక వారు ఇబ్బందులు పడుతూ అస్వస్థతకు గురౌతున్నారని ఇటీవల ఓ బీఎస్ఎఫ్ జవాను తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫుడ్ ని వీడియోలు కూడా తీసి సోషల్ మీడియాలో కూడా పోస్టు చేశాడు. కాగా.. ఆ జవాను కొడుకు ఇప్పుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.ఆర్మీ జవానులకు పెట్టే ఫుడ్ వీడియోస్..సోషల్ మీడియాలో పెట్టినవెంటనే బీఎస్ఎఫ్ జవాను తేజ్ బహదూర్ యాదవ్ ను ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించారు. అయితే.. ఆయన కుమారుడు రోహిత్(22).. వారి ఇంట్లో తలుపులు మూసిఉన్న గదిలో రక్తపు మడుగులో కనిపించాడు. అతని చేతిలో తుపాకీ కూడా ఉంది.అయితే.. పోలీసులు మాత్రాం రోహిత్ ది ఆత్మహత్యగా భావిస్తున్నారు. ఇంట్లో తలుపు గడియపెట్టుకొని ఆత్మహత్య చేసుకొని ఉంటాడని భావిస్తున్నారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరని పోలీసులు చెబుతున్నారు. అయితే.. రోహిత్ హత్య మాత్రం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.