న్యూ ఢిల్లీ: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి భాజపా అహంకారమే కారణమని శివసేన సీనియర్ నేత సంజయ్ రావత్ ఆరోపించారు. సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక పోయిం ది. ఇందుకు శివసేనను నిందించి ప్రయోజనం లేదు. ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే ముందే జరిగిన ఒప్పందాన్ని భాజపా గౌరవిం చి ఉంటే ఈ దుస్థితి దాపురించేది కాదు. శివసేనకు రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవి ఇచ్చే బదులు ప్రతిపక్షంలోనే కూర్చుం టా మని భాజపా చెబుతోంది. సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యత భుజాలపై ఉంచుకునీ ఆ పార్టీ నేతలు శివసేనను నిందించడం అసమంజసమ’ని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ పంపిన ఆహ్వానాన్ని అంగీకరించాం. అయితే ఇందుకు మరి కొంత సమయం ఇస్తే బాగుంటుంద’ని రావత్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటుపై కాంగ్రెస్, ఎన్సీపీలతో మంతనా లు జరిపి నిర్ణయాన్ని తీసుకుంటామని వివరించారు. భాజపా ముఖ్యమంత్రి వద్దని చెప్పిన కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు ఇప్పుడు తమ వైఖరిని స్పష్టీకరించాలన్నారు. ‘కనీస ఉమ్మడి కార్యక్రమం కోసం శరద్ పవార్, కాంగ్రెస్ నేతలు ఒక అవగాహనకు వచ్చా రు. ఈ అవగాహన మేరకు ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకొస్తే అంతా సిద్ధమైనట్టే. ముఖ్యమంత్రి పీఠంపై మాత్రం శివ సేన నాయ కుడే ఉంటార’ని వెల్లడించారు.