అయోధ్య తీర్పుపై మొఘల్ చక్రవర్తి వారసుడి స్పందన..

అయోధ్య తీర్పుపై మొఘల్ చక్రవర్తి వారసుడి స్పందన..

అయోధ్య స్థలం రాములోరికే చెందుతుందంటూ సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పుపై చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వారసుడు ప్రిన్స్ యాకుబ్ హబీబుద్దీన్ టుసీ స్పందించారు.సుప్రీంకోర్టు శనివారం ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనదని తీర్పును దేశంలోని ప్రజలందరూ సంతోషంగా స్వాగతించాలని అన్నారు.అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించేందుకు హిందువులు, ముస్లింలు కలిసి ముందుకు రావాలని ప్రిన్స్ యాకుబ్ వ్యాఖ్యానించారు. అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి బంగారు ఇటుక ఇస్తానని హామీ ఇచ్చానని, తాను ఆ హామీని నెరవేర్చుకుంటానని ప్రిన్స్ యాకుబ్ హబీబుద్దీన్ టుసీ స్పష్టం చేశారు. ఆలయ నిర్మాణానికి పునాది వేయగానే.. ప్రధాని నరేంద్ర మోడీని కలిసి బంగారు ఇటుకను బహూకరిస్తానని చెప్పారు.అయోధ్యలో రామమందిర నిర్మాణానికి దేశంలోని ముస్లింలు అందరూ హిందువులకు సహకరించి సోదరభావం చాటుకోవడం ద్వారా మత సామరస్యంలో భారత్ ఎప్పుడూ ప్రత్యేకమేనన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలన్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos