లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)కు రూ.13,500 కోట్ల వరకూ వంచించి లండన్లో తలదాచుకుంటున్న నీరవ్ మోదీకి బెయిల్ మంజూరుకు లండన్ న్యాయస్థానం తిరస్కరించింది. మానసిక కుంగు బాటుకు గురవుతున్నందున బెయిల్ మంజూరు చేయాలని విన్నవించారు. నీరవ్ మోదీ బెయిల్ వినతి తిరస్కరణకు గురికావడం వరుసగా ఇది నాలుగోసారి. పూచీకత్తు మొత్తాన్ని నాలుగు మిలియన్ల పౌండ్ల మేర రెండింతలు పెంచినా, హౌస్ అరెస్టుకు నీరవ్ మోది అంగీకరించినా ప్రయోజనం లేకుండా పోయింది. తనను ఒకవేళ భారత్కు తిప్పిపంపితే ఆత్మహత్య చేసుకుంటానంటూ నీరవ్ మోదీ బెదిరించాడు. . తదుపరి విచారణ వచ్చే నెల నాలుగుకు వాయిదా పడింది.