ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతల్ని చేపట్టే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి తేల్చి చెప్పారు. గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘ నేను మహారాష్ట్రకు వచ్చే ప్రసక్తే లేదు. ఢిల్లీలోనే విధులను నిర్వహిస్తాన’ని స్పష్టీకరించారు. భాజపా నేతృత్వంలో, దేవేందర్ ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశించారు. దీని గురించి సంఘ పరివార్, దాని అధినేత మోహన్ భగవత్ కూ ఎలాంటి సంబంధం లేదన్నారు. శినసేన మద్దతు తమకు లభిస్తుందని భరోసా వ్యక్తీకరించారు. వారితో చర్చలు కొనసాగుతున్నాయన్నారు.