పెళ్లి బంధంతో ఒక్కటైన పోలీసు ప్రేమికులు

పెళ్లి బంధంతో ఒక్కటైన పోలీసు ప్రేమికులు

హోసూరు సమీపంలో ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడిన పోలీసు ప్రేమికులు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.కృష్ణగిరి జిల్లా అంచెట్టి సమీపంలోని పాండురంగ దొడ్డి గ్రామానికి చెందిన నదియా, కన్నన్,ఇరువురు పోలీసులుగా విధులు నిర్వహిస్తున్నారు.కన్నన్ కృష్ణగిరిలో పనిచేస్తుండగా నదియా తిరుపూర్లో పోలీసుగా పనిచేయతున్నది.ఇదిలా ఉండగా విరిరువురు బంధువులు కావడంతో గత 4 ఏళ్లుగా ప్రేమించుకున్నారు.4 ఏళ్లుగా కలిసి తిరిగిన ఇరువురు పెళ్లి ప్రస్తావన తేగానే కన్నన్ పెళ్లికి నిరాకరించాడు.ఈ సంఘటనతో మనస్తాపానికి గురైన నదియా 3 రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది.బంధువులు సకాలంలో ఆమెను ఆస్పత్రిలో చేర్పించడంతో నదియా ప్రాణాపాయం నుండి బయటపడింది.ఇదిలా ఉండగా నదియా బంధువులు పోలీసులకు పిర్యాదు చేసారు.బాధితుల పిర్యాదుమేరకు పోలీసులు కలుగజేసుకొని ఇరు కుటుంబీకులతో సయోధ్య కుదిర్చి పెళ్లికి ఒప్పించారు.అందులోభాగంగా నదియా,కన్నన్లకు డెన్కనికోటలోని గవి నరసింహస్వామి దేవాలయంలో పెద్దల సమక్షంలో పెళ్ళిజరిపించడంతో కథ సుకతమైయ్యింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos