భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా భావించి ప్రయోగించిన చంద్రయాన్ 2 స్పైవేర్ బారిన పడిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇ స్రో ప్రతిష్టాత్మకంగా చంద్రుడిపైకి ప్రయోగించిన చంద్రయాన్-2 టేకాఫ్‌కు 100 గంటల ముందు ఇస్రో అధికారులకు స్పైవేర్ పై సమాచారం అందడంతో రంగంలోకి దిగి దీనిని గుర్తించే పనిలో పడ్డట్టు సమాచారం.అయితే దీనిపై ఇస్రో నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.అంతరిక్ష పరిశోధనలో అగ్రదేశాలకు ధీటుగా ఒక విధంగా వాటిని దాటి ఇస్రో ముందుకు దూసుకెళుతుండడంతో హ్యాకర్లు ఇస్రోను లక్ష్యంగా చేసుకొని సైబర్ దాడికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.ఇస్రో డొమైన్ కంట్రోలర్స్ హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశాలున్నాయని అమెరికా నిఘా వర్గాలు సైబర్ సెక్యూరిటీని పర్యవేక్షించే జాతీయ సైబర్ సమన్వయ కేంద్రంకు సమాచారం అందించాయి.దీన్ని డీట్రాక్ స్పైవేర్‌గా గుర్తించినట్లు అమెరికా నిఘా వర్గాలు నేషనల్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్‌కు సమాచారం ఇచ్చాయి.డీట్రాక్ అనే స్పైవేర్ లక్ష్యంగా చేసుకున్న సర్వర్లపై దాడి చేసి హ్యాకర్లకు ఆ సంస్థ వినియోగిస్తున్న వివరాలు ఇతర పాస్‌వర్డ్‌లను చేరవేస్తుందని అధికారులు తెలిపారు.కొద్ది రోజుల క్రితం తమిళనాడులోని కూడంకుళం అణువిద్యుత్ కేంద్రంకు సంబంధించిన డేటాపై జరిగిన సైబర్ అటాక్ కూడా డీట్రాక్ హ్యాకర్ల పనేనని దీనిపై అణువిద్యుత్ కేంద్రం,ఇస్రోలను సెప్టెంబర్ 4వ తేదీనే హెచ్చరించినట్లు నేషనల్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ వెల్లడించినట్లు సమాచారం. అక్టోబర్ 30వ తేదీన కూడంకుళం అణువిద్యుత్ కేంద్రంలో ఎలాంటి డేటా హ్యాకింగ్‌కు గురికాలేదని అధికారులు తెలిపారు. అయితే ఆ తర్వాత వైరస్‌టోటల్ . కామ్ అనే ఆన్లైన్ స్కానింగ్ సర్వీసు తమ కంప్యూటర్లలో ఓ మాల్వేర్ను గుర్తించినట్లు అణువిద్యుత్ కేంద్రం నిర్ధారించింది. పాలనా విభాగంలో వినియోగించే కంప్యూటర్లో డీట్రాక్ స్పైవేర్‌ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వెంటనే ఈ అంశాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అదే సమయంలో ప్లాంట్‌లోని ఇతర కంప్యూటర్లకు ఎలాంటి హాని కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.దక్షణ కొరియా సైనిక రహస్యాలు తెలుసుకునేందుకు ప్రయత్నించిన ఉత్తర కొరియా హ్యాకర్ గ్రూప్ బీ కూడంకుళం అణువిద్యుత్ కేంద్రంపై దాడి చేసిన సమాచారంను ఇష్యూ మేకర్స్ ల్యాబ్ ట్వీట్ చేసింది.ఇన్ఫెక్ట్ అయిన కంప్యూటర్లో 16 సంఖ్యల పాస్వర్డ్ వాడినట్లు బయట పెట్టింది.