స్వరా భాస్కర్‌పై ఆగ్రహ స్వరం..

  • In Film
  • November 6, 2019
  • 171 Views
స్వరా భాస్కర్‌పై ఆగ్రహ స్వరం..

బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌పై నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఓ బాలుడు తనను ‘ఆంటీ’ అని పిలిచిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ సన్ ఆఫ్ అభిష్ షోలో స్వరా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.తన కెరీర్ ఆరంభంలో ఓ ప్రకటనలో నటించానని, ఆ సమయంలో ఓ బాలనటుడు తనను ఆంటీ అన్నాడని చెప్పింది.ఆ సమయంలో తాను నిరాశకు గురయ్యాయని పిల్లాడిని చెడామడా తిట్టేశానని పిల్లలు దయ్యాలతో సమానమని వ్యాఖ్యానించింది. ఇందుకు సంబంధించిన ఈ వీడియో బయటకు వచ్చింది.దీంతో స్వరా భాస్కర్‌పై నెటిజన్లతో పాటు సాధారణ ప్రజలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గతేడాది పిల్లలపై వేధింపులకు వ్యతిరేకంగా స్వరా భాస్కర్ ప్లకార్డులు పట్టుకుని ప్రచారం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఓ వైపు బుద్ధులు చెబుతూ మరోవైపు ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి బుద్ధి లేదా అంటూ విమర్శిస్తున్నారు.నాలుగేళ్ల పిల్లోడిని బూతులు తిడతావా? అంటూ స్వరభాస్కర్‌ను నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అప్పుడు కాదు.. ఇప్పుడు నిజంగానే నువ్వు ఆంటీ అయ్యావు అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ‘#swara_aunty’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు.పిల్లలపై చేసిన వ్యాఖ్యలకు స్వరాపై ‘నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్’కు ఓ స్వచ్ఛంద ఫిర్యాదు చేసింది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos