రాజీనామా యోచనలో ఎల్వీఎస్‌

రాజీనామా యోచనలో ఎల్వీఎస్‌

అమరావతి: ప్రధాన కార్యదర్శి బాధ్యత నుంచి తనను బదిలీ చేసిన తీరుపై తీవ్ర మన స్థాపం చెందిన సీనియర్ ఐఐఎస్ అధికారి ఎల్ వి సుబ్రహ్యణ్యం తన ఉద్యోగానికి రాజీ నామా చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. సన్నిహితుల వద్ద ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది. ఆయన అభి ప్రాయాన్ని వారు సమర్థించినట్లు సమాచారం. త్వరలోనే ఆయన తుది నిర్ణయాన్ని తీసుకోనున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ మాజీ కార్యదర్శి, రాష్ట్ర ఆరోగ్య సంస్క రణల అమలు కమిటీ సహ చైర్పర్సన్ సుజాతారావు ‘నిబంధనలు అమలు చేసినందుకు సిఎస్ను బయటకు గెంటేశారు’ వ్యాఖ్యా నించటం గమనార్హం. నిబంధనలతో ఉన్న పాలనే అభివృద్ధికి దోహద పడుతుందన్నీరు. జగన్కు మంచి సలహాదారులు అవసరమని ట్విట్టర్లో సూచిం చారు. కార్యకలాపాల నిబంధనల్ని మార్చి గత నెల 24న జారీ చేసిన ఉత్తర్వులతో పాటు మంత్రి మండలి సమావేశ ప్రతిపాదనల్లో నిబంధనలు పాటిం చ లేదని సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్కు ఎల్వి సుబ్రహ్మణ్యం సంజాయిషీ తాఖీదు జారీ చేయడమే ఆయన బదిలీకి కారణమని వార్తలు రావటం తెలిసిందే. ఇస్పుడు ఆ ఉత్తర్వు చట్ట బద్దతపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos