ఏ హీరోయిన్‌కైనా అయినా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించాలనే కోరిక తప్పకుండా ఉంటుంది. అయితే అది అంత సులభం కాదు.కానీ ఛలో చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టి గీతగోవిందం,డియర్ కామ్రెడ్ చిత్రాలతో యువతలో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న రష్మిక మందన్నకు ఆ అవకాశం అతికొద్ది రోజుల్లనే దక్కింది.సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేశ్‌కు జోడీగా నటిస్తున్న రష్మిక ఈ సినిమాలో మహేష్ సరసన ఆడిపాడేందుకు కేరళ వెళ్లింది.అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.లంగావోణిలో ఉన్న రష్మిక ఫోటోలు అభిమానులకు పిచ్చెక్కుస్తున్నాయి.లంగావోణిలో ఉన్న రష్మికను చూస్తే అచ్చ తెలుగమ్మాయిలా ఉందని కామెంట్లు చేస్తున్నారు.

లంగాఓణీలో రష్మిక