అమరావతి: ‘పవన్ కల్యాణ్ పారితోషికం తీసుకునే సినిమాల్లో నటిస్తాడు. బయట కూడా అంతే. రితోషికం తీసుకునే రాజకీయాలు చేస్తాడని’ ఆయన విశాఖలో పాదయాత్ర పై వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి సోమవారం ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు. ‘పవన్ సినిమాల్లో డైలా గులు వదిలినట్లు బయట కూడా చించేస్తా, పొడిచేస్తా అని చిటికెలు వేస్తుంటే ఆ ఉచిత వినోదం కోసం కొందరు గుమికూడతారు. ఆ తర్వాత లాంగ్ మార్చ్ అనుకుంటూ ఎవరిళ్లకు వారు వెళ్లిపోతార’ని ఎద్దేవా చేశారు. ‘ప్రజలకు దత్త పుత్రులు, చుట్టపు చూపుగా వచ్చే పుత్రుల అవసరం లేదు. ప్రజ లను కన్నబిడ్డల్లా చూసుకునే వైఎస్ జగన్ చాల’ని పేర్కొన్నారు. ‘పెద్ద కొడుకునని చెప్పుకున్న చంద్రబాబు వంచనతో లక్షల కోట్లు దోచుకెళ్లాడు. ఇప్పుడు మీ దత్తపుత్నుడ్ని వచ్చానని చెబితే ప్రజలు కర్రలు, చీపుర్లతో తరిమి కొడతార’ని వ్యాఖ్యానించారు. ‘చంద్రబాబుకు ఏదో ఒక హడావుడి చేయాలి. కాబట్టే దత్త పుత్రుడ్ని ముందుకు నెట్టాడు. లాంగ్ మార్చ్ కాస్తా తుస్సుమంద’ని హేళన చేసారు.