పాక్‌ రైల్లో 62 మంది సజీవ దహనం

పాక్‌ రైల్లో 62 మంది సజీవ దహనం

ఇస్లామాబాద్: లియాఖత్పూర్ వద్ద గురువారం ఉదయం రైలులో సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంలో 62 మంది సజీవ దహన మయ్యారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. లాహోర్ నుంచి కరాచీ వెళ్తున్న తేజ్గావ్ ఎక్స్ప్రెస్లో గ్యాస్ సిలిండర్ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచా రాన్ని అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రైలులో చిక్కుకున్న వారిని రక్షించారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అంటుకున్న మంటల్ని ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు ఇతర పెట్టెలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos