భర్త కోడిగుడ్డు తేలేదని ప్రియుడితో జంప్..

భర్త కోడిగుడ్డు తేలేదని ప్రియుడితో జంప్..

భార్య భర్తల మధ్య గొడవలు అత్యంత సహజమైన విషయం.ప్రతి ఇంట్లోనూ సర్వసాధారణంగా భార్యభర్తల మధ్య ఏదోఒక విషయంపై గొడవలు జరుగుతూనే ఉంటాయి.అయితే వాటిలో కొన్ని అప్పటికప్పుడు లేదా రోజులకో సమసిపోతే మరికొన్ని పంచాయితీల వరకు వెళ్లి పరిష్కారమవుతుంటాయి.కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ భార్యామణి భర్తపై అలిగి ప్రియుడితో వెళ్లిపోయింది.అయితే సదరు మహిళ ప్రియుడితో వెళ్లిపోవడానికి వెల్లడించిన కారణం అందరినీ షాక్‌కు గురి చేసింది.అసలు మ్యాటరేంటంటే…. ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ జిల్లా కాంపియర్ గంజ్ కు చెందిన ఓ మహిళకు కోడిగడ్డు అంటే చాలా ఇష్టమట. ఎప్పుడూ గుడ్డు తెమ్మని ఆమె భర్తని కోరుతూ ఉంటుందట.భర్త ఎప్పుడైనా గుడ్డు తేకపోతే.. కచ్చితంగా గొడవ పెట్టుకునేది. ఇటీవల కూడా ఇలానే జరగడంతో… భర్తను వదిలేసి ప్రియుడితో పరారయ్యింది.భార్య కనిపించడం లేదంటూ భర్త పోలీసులను ఆశ్రయించడంతో విచారణ జరిపి మహిళ ఆచూకీ కనుగొన్న పోలీసులు కౌన్సలింగ్ ప్రారంభించారు.అందులో భాగంగా భర్తను వదిలేసి ప్రియుడితో ఎందుకు లేచిపోయావని పోలీసులు ప్రశ్నించగా…ఆమె చెప్పిన సమాధానం అందరినీ విస్మయానికి గురిచేసింది.తన భర్త రోజూ గుడ్డు తేవడం లేదని అందుకే వదిలేశానని చెప్పడం విశేషం. విచిత్రం ఏమిటంటే…. ఆమెకు గుడ్డు అంటే ఇష్టమున్న విషయాన్ని తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన వ్యక్తి ఆమెకు రోజూ కోడిగుడ్లు ఇచ్చి దగ్గరయ్యాడు. కేవలం గుడ్డుకోసమే ఆమె భర్తను వదిలేసి ప్రియుడితో పరారవ్వడం అందరినీ విస్మయానికి గురిచేసింది.

తాజా సమాచారం