రాష్ట్రపతి పాలన రద్దు

రాష్ట్రపతి పాలన రద్దు

న్యూ ఢిల్లీ: జమ్మూ-కశ్మీర్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోవటంతో అవిభక్త జమ్మూ-కశ్మీర్లో విధించిన రాష్ట్రపతి పాలనను కేంద్రం గురు వారం ఎత్తి వేసింది. 2017 జూన్లో అవిభక్త జమ్మూ-కశ్మీర్లో పీడీపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి భాజపా తన మద్దతు ఉపసంహ రించుకుంది. సంఖ్యా బలం లేక పోవటంతో అప్పటి ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ రాజీనామా చేశారు. దరిమిలా రాష్ట్ర పతి పాలన జమ్మూ-కశ్మీర్ ఇప్పుడు కశ్మీర్, లద్ధాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయింది. రాజ్యాంగంలోని 356 అధికరణ ప్రకారం రాష్ట్రపతి పాలన కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తించదు. దీంతో దాన్ని ఎత్తి వేస్తున్నట్లు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రకటించారు. లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతానికి తొలి లెఫ్టినెంట్ గవర్నర్గా ఆర్.కె. మాథుర్ గురు వారం ప్రమాణాన్ని చేశారు. లేహ్లోని తిసూరులో జరిగిన కార్యక్రమంలో జమ్మూ-కశ్మీర్ ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ గీతా మిత్తల్ ఆయ నచే ప్రమాణాన్ని చేయించారు. కశ్మీర్ గవర్నర్గా గిరిశ్ చంద్ర ముర్ము నియమితులయ్యారు. త్వరలోనే పునర్విభజన ప్రక్రియ జమ్మూకశ్మీర్ విభ జన అమల్లోకి రావడంతో ఎన్నికల కమిషన్ త్వరలోనే పునర్విభజన ప్రక్రియ చేపట్టనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos