హైదరాబాదు: దసరా సెలవుల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక తరగతులు నిర్వహించిన ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ రోజుకు రూ.లక్ష వంతున జరిమానా విధించారు. దసరా సెలవుల్లో మొత్తం 50 కళాశాలలు తరగతుల్ని నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు. వీటిలో 47 కళాశాలలు శ్రీ చైతన్య, నారాయణ సంస్థలవి. నవంబరు 2లోగా జరిమానా చెల్లించక పోతే కళాశాల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు.