ఇస్లామా బాద్: గురు నానక్ దేవ్ 550వ జయంత్యుత్సవ సందర్భంగా పాకిస్థాన్ గురు నానక్ స్మారక నాణేలను బుధవారం విడుదల చేసింది. ఈ ఫొటోలను ఆ దేశ ప్రధాన మంత్రి ఇమ్రాన్ఖాన్ ఫేస్బుక్లో ఎక్కించారు. ‘గురునానక్ జయంతి సందర్భంగా ఆయన స్మారక నాణేలను పాక్ విడుదల చే సిం ద’ని పేర్కొన్నారు. కర్తార్పూర్ సాహెబ్ సందర్శన గురించి నిరుడు నవంబరులో భారత్-పాకిస్థాన్ల మధ్య కుదిరిన ఒప్పందంపై గత వారం కింద ట రెండు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. గురు నానక్ జయంతి సందర్భంగా నవంబర్ 9న కర్తార్పూర్ కారిడార్ను ప్రారంభం కానుంది. యాత్రి కుల సౌకర్యార్థం దీన్ని ముందుగానే ప్రారంభిస్తున్నారు. పాకిస్థాన్లోని రావినది ఒడ్డున ఉన్న నారోవల్ జిల్లాలో కర్తార్పూర్ సాహిబ్ ఉంది. యాత్రికుల వసతి కోసం పాకిస్థాన్ 80 వలస కేంద్రాల్ని ఏర్పాటు చేసింది. రోజుకు 5వేల మంది యాత్రికులను అనుమతించనుంది.