ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఎదుగూ, బొదుగూ లేకుండా ముగిసాయి. బిఎస్ఈ సెన్సెక్స్ 38 పాయింట్లు పెరిగి 39,058కి, నిఫ్టీ కేవలం ఒక పాయింటు లాభంతో 11,584 వద్ద ఆగింది. బీఎస్ఈ లో యస్ బ్యాంక్ (7.97%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (7.19%), ఐసీఐసీఐ బ్యాంక్ (3.18%), సన్ ఫార్మా (2.72%), టీసీఎస్ (2.06%) ఇతరుల కంటే ఎక్కువ లాభాన్ని గడించాయి. టాటా మోటార్స్ (-4. 87%), వేదాంత (-2.47%), హెచ్డీ ఎఫ్సీ లిమి టెడ్ (-2.01%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.99%), బజాజ్ ఫైనాన్స్ (-0.95%) బాగా నష్ట పోయాయి.