అమరావతి:విపక్షంగా ఉన్నా; పాలక పక్షమైనా సరే వైకాపాను దుయ్య బట్టటాన్నే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పనిగా పెట్టుకున్నారని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మండి పడ్డారు. శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. తెదేపా అధినేత చంద్రబాబుతో లాలూచీ, ముఖ్యత్రి జగన్ పేచీయే పవజమని వ్యాఖ్యానించారు. ‘పవన్‌కి వ్యతిరేకంగా కేసుల్లేవు. భాజపా. తెదేపాతో కలసి ఏమి సాధించారు? ప్రభుత్వ ఉత్తర్వు 486 పై మోదీకి చెప్తానన్న పవన్ రాష్ట్ర హక్కుల కోసం మోదీ దగ్గర కెళ్లలేదు. అమాయకుడైన కె. ఏ పాల్ అమాయకుడు ఐలపురం హోటల్ లో బాబుతో ఎన్నికల ఒప్పందాన్నికుదుర్చు కున్నారు.తెలివైన వపన్ అమెరికాలో ఆ పని చేసారు. పవన్ పోటీ చేసిన చోట ప్రచారం చేయలేదని బాబే చెప్పారు. ఉద్దానం లో కిడ్నీ ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే పవన్ నోరు మెదపరని’ ధ్వజ మెత్తారు. బంగారు బాతు లాంటి రాజధాని నిర్మాణం చేసానన్నారు. హైకోర్టు న్యాయమూర్తి అక్కడ టీ కూడా దొరకదన్నారు. బాబు కట్టిన బంగారు బాతు ఎక్కడ? ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా బాబు, రూ.లక్ష,రూ.కోట్లు దోచుకున్నారు. తాత్కాలిక భవనాలకు చదరపు అడుగుకి 12 వేలు పెట్టి కొల్లగొట్టారు.అని విమర్శించారు.