శ్రీనగర్: జమ్ము-కశ్మీర్, షోపియాన్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ట్రక్కు డ్రైవర్లపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. వీరిలో ఒకరిని రాజస్థాన్ ఆళ్వార్కు చెందిన ఇలియాస్గా గుర్తించారు. గాయపడిన జీవన్ను శ్రీనగర్ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. యాపిల్ పండ్లు తీసుకెళ్తున్న రెండు లారీలకూ ఉగ్ర వాదులు నిప్పంటించారు.