నెల్లూరు: తెలుగుదేశం సీనియర్ నేత బెజవాడ ఓబుల్ రెడ్డి పార్థివ దేహానికి నెల్లూరు లోక్సభ సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గురువారం శ్రద్ధాంజలి ఘటించారు. బెజవాడ ఓబుల్ రెడ్డి బుధవారం కన్నుమూసిన విషయం తెలిసిందే .ఈ సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు తన సంతా పాన్ని ప్రకటించారు . ఆయనతోపాటు విజయ డైరీ ఛైర్మన్ రంగారెడ్డి కోటేశ్వర్ రెడ్డి , నరసింహారావు తదితరులు ఉన్నారు .