ఉగ్రవాదం అణచివేత పాక్‌కు అనివార్యం

ఉగ్రవాదం అణచివేత  పాక్‌కు  అనివార్యం

న్యూఢిల్లీ: ఇప్పటి వరకూ పెంచి పోషించిన ఉగ్రవాదాన్ని తుద ముట్టించటం పాక్‌ కు అనివార్యమైందని భారత పదాతి దళపతి బిపిన్ రావత్ శనివారం ఇక్కడ విలేఖరులతో అన్నారు. ఉగ్ర వాదులకు, వారి సంస్థలకు ఆర్థిక సహకారం అందించినందకు శుక్రవారం ఆర్థిక చర్యల కార్య చరణ దళం (ఎఫ్ఏ టీఎఫ్) పాక్ను మందలించినందుకు రావత్స్పందించారు. ‘పాక్ పై గతంలో ఎన్నడూ లేని ఒత్తిడి పెరిగింది. ఉగ్రవాదాన్ని అణచివేయకుండా తప్పించు కోవడం కుదరదు. కచ్చితంగా వాళ్లు చర్యలు తీసుకుని తీరాల్సిందే. శాంతి సామరస్యాలను నెలకొల్పడానికి చర్యల్ని తీసుకోవాలని పాక్ను కోరుకుం టు న్నామ’న్నారు. ‘గ్రే లిస్ట్ లో పెట్టడం ఏ దేశానికికైనా ఎదురు దెబ్బే. అలాంటిదీ బ్లాక్ లిస్ట్ లో పెడితే ఏ దేశమూ కోలుకోదు. కాబట్టి పాక్ ఇప్పుడు ఎఫ్ఏటీఎఫ్ సిఫార్సులను కచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే’ నన్నారు. ఎఫ్ఏటీఎఫ్ నిర్దేశించిన 27 లక్ష్యాల్లో 22 అంశాల్లో పాక్ విఫలమైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోసిఫార్సులను అమలు చేయకపోతే పాక్ను బ్లాక్ లిస్ట్ లో చేర్చుతామని హెచ్చరించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos