18 బిలియన్ డాలర్లయిన రక్షణ వ్యాపారం

18 బిలియన్ డాలర్లయిన రక్షణ వ్యాపారం

వాషింగ్టన్: భారత్-అమెరికా ద్వైపాక్షిక రక్షణ వాణిజ్యం ఈ ఏడాదికి 18 బిలియన్ డాలర్లవుతుందని అమెరికా రక్షణ విభాగం -పెంటగాన్ శనివారం ఇక్కడ ప్రకటించింది. భారత్తో తమ బంధాన్ని మరింత బలోపేతం చేయదలచినట్లు పెంటగాన్ ఉన్నతాధికారి ఎలెన్ ఎమ్ లార్డ్ అన్నారు. వచ్చే వారం ఢిల్లీలో జరగనున్న భారత్-అమెరికా రక్షణ సాంకేతిక పరిజ్ఞానం, వాణిజ్య కార్యక్రమం(డీటీటీఐ) తొమ్మిదో సమావే శానికి ఎలెన్తో పాటు మరో ఉన్న తా ధికారి హాజరు కానున్నారు. గత ఆగస్టులో రెండు దేశాల మధ్య జరిగిన రక్షణ విధాన బృంద సమావేశం తరవాత భారత్కు స్ట్రాటజిక్ ట్రేడ్ అథారిటీ టైర్-1 హోదా కల్పించినందున అమెరికా సంస్థలు కంపెనీలు ద్వంద్వ వినియోగ, అధునాతన పరికరాల్ని భారత్కు సమకూర్చే వెసులు బాటు కలిగిందన్నారు. దరిమిలా నాటో సభ్యులు జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియాతో సమాన హోదా భారత్కు లభించిందని చెప్పారు. నాటో సభ్యు లైన సౌత్ కొరియా, ఇజ్రాయెల్తో సమాన హోదా భారత్కు కల్పించాలని సెనెట్లో లెజిస్లేటివ్ ప్రొవిజన్ పాస్ అయ్యిందన్నారు.ఇవన్నీ రెండు దేశాల మధ్య  పెరుగుతున్న సైనిక సహకారం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఉమ్మడి ఆశయాలకు సూచికలని పేర్కొన్నారు. రెండు దేశాల్లో రక్షణ పరికరాలు, ఆయు ధాల తయారీకి గల సామర్థ్యాల్ని విశ్లేషిస్తున్నామని తెలిపారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos