ఆ సంస్థలకు జరిమాన విధించాలి

ఆ సంస్థలకు జరిమాన విధించాలి

న్యూఢిల్లీ :ఇంటర్ కనెక్టివిటి రాబడి అక్రమ ఆర్జనకు వోడాఫోన్, ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్ సంస్థలు ల్యాండ్లైన్ నెంబర్లను మొబైల్ నెంబర్లుగా చూపా యని రిలయన్స్ జియో ఆరోపించింది. వాటిపై జరిమానా విధించాలని టెలికం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్)కి చేసిన ఫిర్యాదులో కోరింది. ఎయిర్టెల్, వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్ అక్రమాల వల్ల తాము, ప్రభుత్వం రూ. కొన్ని వందల కోట్ల ఆదాయాన్ని కోల్పోయాయయని పేర్కొంది. దరిమిలా ఆయా సంస్థలకు తాము చెల్లించిన టెర్మినేషన్ ఛార్జీల్ని తిరిగి తమకు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. జియో ఆరోపణలను ఎయిర్టెల్ తోసి పుచ్చిం ది. ఇంటర్కనెక్ట్ యూసేజ్ చార్జ్పై సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో ట్రాయ్ను తప్పు దారి పట్టించేందుకు జియో ప్రయత్ని స్తోందని దుయ్యబట్టింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos