చొరబాటు దారు కాల్చివేత

చొరబాటు దారు కాల్చివేత

చండి ఘడ్: పాక్ చొరబాటుదారుడిని బీఎస్ఎఫ్ జవాన్లు బుధవారం సాయంత్రం అట్టారి వద్ద కాల్చి చంపారు. సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద ఒక గుర్తు తెలియని వ్యక్తి 103 నెంబరు గేటు చేరుకునేందుకు ప్రయత్నించినపుడు అతణ్ని తిరిగి వెనక్కి వెళ్లాలని బీఎస్ఎఫ్ జవాన్లు హెచ్చరించారు. అయినా తను ముందుకు సాగటంతో జవాన్లు కాల్పులు జరిపారు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మృతుణ్ని గుల్నవాజ్గా గుర్తించారు. మృత దేహం పక్కనున్న చేతి సంచి నుంచి జత బట్టలు, సిమ్ కార్డు, మెమరీ కార్డు స్వాధీనం చేసుకున్నారు. దీని గురించి సరిహద్దు పాక్ సైనికాధి కారులను సంప్రదించినపుడు ఏ విధమైన స్పందనా రాలేదు. అట్టారి రైల్వే స్టేషన్ ప్రాంతంలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos