లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 25 వేల హోం గార్డులను మంగళవారం ఉద్యోగాల నుంచి తొలగించింది. ఇందకు గల కారణాలు తెలియదని డీజీపీ బీపీ జోగదండ్ పేర్కొన్నారు. ‘ఎన్నికలకు ముందు యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఇప్పుడు వారికి మొండిచేయి చూపార’ని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అజయ్ వ్యాఖ్యానించారు.