అల్లువారి ఆస్తి పంపకాలు..

  • In Film
  • October 15, 2019
  • 150 Views
అల్లువారి ఆస్తి పంపకాలు..

తెలుగు చిత్ర పరిశ్రమలో పంపిణీదారుడిగా,నిర్మాతగా విజయపథంలో దూసుకెళుతున్న అల్లు అరవింద్ తాజాగా ఆస్తి పంపకాలు చేసినట్లు సమాచారం.ముగ్గురు కొడుకులైన బాబీ,అల్లు అర్జున్,అల్లు శిరీష్లకు ఆస్తి సమానంగా పంచినట్లు సమాచారం.ఇక ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన గీతా ఆర్ట్స్ బ్యానర్‌ను పెద్ద కొడుకు బాబీకి పంచారని వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా అల్లు అరవింద్ ఇంట్లో చోటు చేసుకుంటున్న మార్పుల నేపథ్యంలో అల్లు అరవింద్ అస్తుల పంపకం చేశారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.ఇటీవలే అల్లు అరవింద్ పెద్ద కొడుకు వెంకటేష్ కూడా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఏకంగా నిర్మాతగా మారి వరుణ్ తేజ్ హీరోగా సినిమా మొదలు పెట్టేశారు. దానికి అల్లు అరవింద్ ప్రజెంట్స్ అనే పేరు కూడా పడింది. ఈ కోణంలోనే గీతా ఆర్ట్స్ వ్యవహారాలను అల్లు వెంకటేష్ చేసుకునేలా అరవింద్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.ఇక అల్లు అర్జున్ త్వరలోనే సొంత నిర్మాణ సంస్థ ప్రారంభించడానికి సన్నాహాల్లో ఉన్నట్లు పరిశ్రమలో వార్తలు వినిపిస్తున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos