శ్రీ హరి కోట: ఇక్కడి సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం లోని రెండో వాహన అనుసంధాన భవనంలో మంగళవారం ప్లాట్ ఫారాలు కూలిపోవటంతో రూ.రెం డు కోట్ల వరకూ ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రాణ నష్టం జరుగలేదు. పరికరాల్ని మోసుకెళ్లే గేర్ బాక్స్ లో ఏర్పడిన సాంకేతిక లోపం ఈ ప్రమాదానికి కార ణంగా భావిస్తున్నారు. లోపాన్ని సరిచేస్తున్నపుడు, రెండు ప్లాట్ ఫారాలు కూలాయని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాల్ని తెలుసు కునేందుకు ప్రత్యేక సమితిని నియమించినట్లు ఉన్నతాధికార్లు తెలిపారు. వాహన అనుసంధాన భవన నిర్మాణం గత జూలై 14న ముగిసింది. ప్రారం భం అయింది. మూడు నెలలూ గడవక ముందే ప్రమాదం సంభవించినందుకు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేసారు.