సమ్మెకు తెర పడే అవకాశం!

సమ్మెకు తెర పడే అవకాశం!

డిమాండ్ల నెరవేర్చాలంటూ పది రోజులకు పైగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె మరోస్థాయికి వెళ్లడంతో కార్మికులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కార్మికులను మరింత రెచ్చగొట్టేలా సీఎం కేసీఆర్ సైతం అంతే పంతంతో ఉండడంతో సెల్ఫ్ డిస్మిస్ అంటూ బెదిరించడానికి ప్రయత్నించడంతో కొంతమంది కార్మికులు ఆత్మహత్యలకు, గుండెపోటుకు గురి కావడంతో సమ్మె తీవ్రరూపం దాల్చింది.ఈ నేపథ్యంలో ఇంకా ఈ సమస్యను కొనసాగించటం మంచిది కాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. దీంతో..ప్రభుత్వం సైతం పైకి బెట్టు వీడినట్లు కనపడకుండా.. సమ్మె పరిష్కారం దిశగా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. తమ పార్టీ నేత కేకే ద్వారా చర్చలకు సానుకూలమనే అభిప్రాయం కిలిగించింది. అయితే..కేకే మాత్రం ముఖ్యమంత్రి చెబితేనే చర్చలు నిర్వహిస్తానని తేల్చి చెప్పారు. మరో వైపు తాము చర్చలకు సిద్దమని కార్మిక సంఘాలు స్పష్టం చేసిన సమయంలో ప్రభుత్వం చర్చలు చేయకపోతే.. ప్రభుత్వం మీదనే నెపం పడే అవకాశం ఉంటుంది. దీంతో..మధ్యే మార్గంగా ఈ రోజు సమ్మెలో కొత్త మలుపు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నట్లుగా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం డిమాండ్‌పై మాత్రం చర్చలు లేవని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అది మినహా మిగిలిన అంశాల మీద చర్చకు అభ్యంతరం లేదనే సంకేతాలను అందిస్తోంది. హుజూర్ నగర్ ఎన్నికలో అధికార పార్టీకి సీపీఐ మద్దతు ఉప సంహరించుకుంది. చర్చల బాధ్యతను రాజకీయంగా వేరే పార్టీలు..సంఘాలకు ఇచ్చి వారికి క్రెడిట్ ఇవ్వటం కంటే..పార్టీ నేతల ద్వారానే చర్చల ప్రతిపాదన తీసుకురవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పార్టీ సీనియర్ కేకే జోక్యం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఆర్టీసీ జేఏసీ సంఘాలు సైతం పట్టుదలకు పోకుండా చర్చలకు సానుకూల వాతావరణం తీసుకొచ్చేందుకు సిద్దంగా ఉన్నారని సమాచారం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos