ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాల్లో వ్యాపారాల్ని ఆరంభించాయి. ఉదయం 9.48గంటల వేళకు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 119; పాయింట్ల లాభంతో 38,333 వద్ద, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 30 పాయింట్లు లాభపడి 11,371 వద్ద వ్యాపారాల్ని చేసాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 70.58గా దాఖలైంది. ఐఓసీ, హెచ్‌యూఎల్, బీపీసీఎల్, సన్‌ఫార్మా, బ్రిటానియా షేర్లు లాభాల్ని పొందాయి. టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జీ ఎంటర్టైన్మెంట్, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టాల పాలయ్యాయి.