జగన్ సభపై రైతుల ఉత్సాహం

జగన్ సభపై రైతుల ఉత్సాహం

నెల్లూరు : ఇక్కడికి మీపంలోని కాకుటూరులో మంగళవారం జరగనున్న రైతు భరోసా సభకు హాజరయ్యేందుకు రైతులు ఎంతో ఉత్సాహం చూపుతున్నారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కాకుటూరులో సభా వేదిక ఏర్పాట్లను పరిశీలించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో వర్షాలు కురిసి రెండు పంటలు పండాయని గుర్తు చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక వర్షాలు సమృద్ధిగా కురిశాయని, జిల్లాలో 100 టీఎంసీల నీరు నిల్వ ఉందని వెల్లడించారు. ఇవి రెండు పంటలు పండేందుకు సరిపోతాయని, రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోందని చెప్పారు. అందుకే జగన్ సభకు వచ్చేందుకు రైతులు చాలా ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. రైతులకు ఎంతగానో ఉపకరించే రైతు భరోసా కార్యక్రమాన్ని నెల్లూరులో ఆవిష్కరించడం ఎంతో సంతోషదాయకమని పేర్కొన్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, అధికారులు చక్కగా ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సభకు రైతులు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి , మాజీమంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, పార్టీ నాయకులు నరసింహారావు, మల్లు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos