కరుడుగట్టిన ‘ఖైదీ’..

  • In Film
  • October 14, 2019
  • 135 Views
కరుడుగట్టిన ‘ఖైదీ’..

కెరీర్‌ మొదలుపెట్టినప్పటి నుంచి అన్నతో సమానంగా తమిళం,తెలుగులో ఒక రేంజ్‌లో హిట్స్ అందుకొని అభిమానులు సంపాదించుకున్న కార్తీ కొద్ది కాలంగా తెలుగులో అనుకున్నంతగా సక్సెస్ అందుకోవడం లేదు.కథల ఎంపికలో తప్పిదాలు చేస్తూ దారుణంగా విఫలమవుతున్నాడు. ఖాకి సినిమాతో పర్వాలేదనిపించిన కార్తీ ఆ తరువాత చినబాబు – దేవ్ సినిమాతో డిజాస్టర్స్ అందుకున్నాడు. ఇప్పుడు ఖైదీ అనే మరొక డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు.ఆ సినిమా ట్రైలర్ ని రీసెంట్ గా విడుదల చేసిన కార్తీ యాక్షన్ అండ్ థ్రిల్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటున్నాడు.జైలు నుంచి తప్పించుకున్న ఒక ఖైదీ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనేది సినిమా అసలు పాయింట్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ద్వారా కార్తీ తెలుగు ఆడియెన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos