చలి తట్టుకోలేక కారులో కుంపటి. డ్రైవర్ దుర్మరణం

  • In Crime
  • January 17, 2019
  • 960 Views
చలి తట్టుకోలేక కారులో కుంపటి. డ్రైవర్ దుర్మరణం

చలిని తట్టుకోలేకపోయిన ఓ వ్యక్తి చలి నుంచి రక్షణ పొందేందు గాను ఓ వ్యక్తి  కారులో నిప్పుల కుంపటి వెలిగించడంతో ఊపిరాడక మరణించాడు. వివరాల్లోకి వెళితే… ఢిల్లీలోని ఖోడా కాలనీకి చెందిన సతేంద్ర ఓలా క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

ఈ క్రమంలో బుధవారం అర్థరాత్రి నైట్ డ్యూటీలో ఉన్నాడు. అయితే చలి బాగా ఎక్కువగా ఉండటంతో దాని నుంచి రక్షణ పొందేందుకు గాను నిప్పుల కుంపటి వెలిగించి కాసేపు చలికాచుకున్నాడు. అయితే నిద్ర ముంచుకు రావడంతో నిప్పుల కుంపటిని కార్‌లోనే ఉంచుకుని డోర్ లాక్ చేసుకోవడంతో ఊపిరి ఆడక మరణించాడు.

తెల్లవారుజామున పెట్రోలింగ్‌కు వెళ్తున్న పోలీసులకు కారులోంచి పోగలు రావడంతో వెంటనే అద్దాలు పగులగొట్టి సతేంద్రను బయటకు తీసి, ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు. నిప్పుల కుంపటి నుంచి వెలువడిన పొగ కారణంగానే అతను ఊపిరి ఆడక మరణించినట్లు వైద్యులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos