అజయ్ పాత్ర ఎంట్రీతో సినిమాలో ఊపొస్తుందట..

  • In Film
  • October 13, 2019
  • 135 Views
అజయ్ పాత్ర ఎంట్రీతో సినిమాలో ఊపొస్తుందట..

కొబ్బరికాయ కొట్టిన రోజు నుంచే జాతీయస్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న ఆర్ఆర్ఆర్ చిత్రం చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది.వచ్చే ఏడాది జులై 30వ తేదీ విడుదల తేదీగా ముందే ప్రకటించిన నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి చిత్రీకరణను శరవేగంగా పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు.కాగా ఈ చిత్రంలో తారక్,చరణ్ కొమురం భీం,అల్లూరి సీతారామా రాజు పాత్రలో నటిస్తుండగా అజయ్ దేవగణ్,సముద్ర ఖని మరో కీలకపాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.సినీ వర్గాల సమాచారం ప్రకారం అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో తారక్,చరణ్‌లకు గురువు పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.డిల్లీలో ఈ పాత్ర వీరికి పరిచయం అవుతుందిట.అప్పటికే డిల్లీలో స్వతంత్ర్య ఉద్యమాన్ని అజయ్ దేవగన్ నడుపుతూంటాడని తెలుస్తోంది.అల్లూరి, కొమరం భీమ్ లను చూసిన తర్వాత వారిలో కూడా ఉత్సాహం నింపి, ఉద్యమం దిసగా వారిని మలిచే పాత్ర ఇది అని తెలుస్తోంది.వారిలో బ్రిటీషు వారి అణిచివేతను ప్రశ్నించే గుండెధైర్యాన్ని నింపే పాత్రలో నటించనున్నాడు.మొదట చిత్రంలో నటించడానికి సంశయించినా పాత్రకు చాలా ప్రాధాన్యత ఉండడంతో నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.అజయ్ దేవగన్ పాత్ర చిత్రాన్ని మరోస్థాయికి తీసుకెళుతుందని సమాచారం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos