సైనికుల కోసం సైరా ప్రత్యేక ప్రదర్శనలు!

  • In Film
  • October 12, 2019
  • 155 Views
సైనికుల కోసం సైరా ప్రత్యేక ప్రదర్శనలు!

తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు సాధిస్తూ రూ.100 కోట్ల దిశగా దూసుకుపోతోంది.తొలి స్వాతంత్య్ర సమరయోధుడే అయినా నరసింహారెడ్డి గురించి చరిత్రపుటల్లో ఎక్కడా ప్రస్తావన లేకపోవడంతో ఈ చిత్రానికి మరింత ప్రచారం కల్పించి నరసింహారెడ్డి చరిత్రను ప్రజలకు తెలియజేయడానికి చిత్ర బృందం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో బెంగళూరు నగరంలో భారత సైనికుల కోసం ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.కర్ణాటకలో సైరా పంపిణీ హక్కులు దక్కించుకున్న ధీరజ్ ఎంటర్ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ బెంగళూరులో ఆర్మీ, వాయుసేన సిబ్బంది కోసం దాదాపు 60 ప్రదర్శనలు కేటాయించినట్లు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos