చిన్నారుల క్రియేటివిటీపై మహీంద్రా ట్వీట్‌..

చిన్నారుల క్రియేటివిటీపై మహీంద్రా ట్వీట్‌..

ఏదైనా క్రియేటివిటీగా అనిపించినా లేదా సమాజంలో స్పూర్తి నింపేవిధంగా ఘటన తన కంటపడినా వెంటనే వాటిని సామాజిక మాధ్యమాల ఖాతాల్లో పోస్ట్ చేసే మహీంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా తాజాగా అటువంటి మరో ఫోటో షేర్ చేయగా అదికాస్త వైరల్‌గా మారింది.’నా వాట్సాప్ వండర్ బాక్స్ లో ఈ రోజు ఉదయం ఓ అద్భుతమైన ఫొటో చూశాను. భారత్‌లో ఊహాశక్తికి ఎటువంటి కొదవలేదన్న విషయాన్ని నిర్వివాదంగా ఇది రుజువు చేస్తోంది’ అని ట్వీట్ చేశారు.కొంతమంది పిల్లలు క్యారమ్స్ ఆడుతుండడం ఈ ఫొటోలో ఉంది. అయితే, ఆ ఫొటోను గమనించి చూస్తే వారు ఆడుతున్న క్యారమ్ బోర్డ్ చెక్కతో చేసింది కాదు. డబ్బు ఖర్చు చేయకుండా మట్టిని చదునుగా చేసి, అచ్చం క్యారమ్ బోర్డులా చేసుకుని ఆ పేద పిల్లలు ఆడుకుంటున్నారు. ఇక క్యారమ్స్ డిస్క్ లకు బదులుగా సీసాల మూతలను వినియోగించారు. అందుకే ఆనంద్ మహీంద్రాను కూడా వీరి క్రియేటివిటీ ఆకర్షించింది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos