న్యూఢిల్లీ: తమ నెట్ వర్క్ నుంచి ఇతర నెట్ వర్క్ లకు చేసే కాల్స్ కు ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జ్ (ఐయూసీ)లను వసూలు చేయబోమని వోడఫోన్ – ఐడియా తమ వినియోగదార్లకు శుభవార్త తెలిపింది. ఇది జియోకు పెద్ద షాక్గా చరవాణి సంస్థలు భావించాయి. ‘కాల్స్ మొత్తం ఉచితమే. కేవలం డేటాకు డబ్బు చెల్లిస్తే సరిపోతుంద’ని రెండేళ్ల కిందట మార్కెట్లోకి వచ్చిన జియో ప్రకటించింది. ఇది భారత టెలికం రంగంలో సంచలనమైంది. జియో ఇప్పుడు తాజాగా ఐయూసీ చార్జీల వసూలు ప్రకటనతో సామాసజిక మాధ్యమాల్లో జియోపై విమర్శలు వెల్లువెత్తాయి. వినియోగదారుల సంఖ్య లో అగ్రగామిగా ఉన్న వోడాఫోన్-ఐడియా మాత్రం తమకు ఎటువంటి ఐయూసీ చార్జీలను వసూలు చేసే ఉద్దేశం లేదని తెలిపింది. వినియోగ దారులపై భారం పడకూడదనేదే తమ అభిమతమని తెలిపింది. ఐయూసీ ఛార్జీల వసూలు ఇంటర్ కనెక్ట్ మధ్య ఉన్న సమస్యకు పరిష్కారం కాదని వ్యాఖ్యానిం చింది.