హైదరాబాద్ చుట్టూ పరిశ్రమలు

హైదరాబాద్ చుట్టూ పరిశ్రమలు

హైదరాబాద్ : అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ మరో 8 లాజిస్టిక్స్ పార్కుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా మంగళ్‌పల్లి సమీపంలో హెచ్ఎండీఏ- అంకాన్ లాజిస్టిక్స్ పార్కును శుక్రవారం ఆయన మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.22 కోట్ల వ్యయంతో ఈ పార్కు ఏర్పాటైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ, ఈ పార్కుతో ప్రత్యక్షంగా వెయ్యి మందికి ఉపాధి లభించనుందని చెప్పారు. టాస్క్ ద్వారా స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నామన్నారు. బాటసింగారం లాజిస్టిక్ పార్కును జనవరిలో ప్రారంభిస్తామన్నారు. ఎలిమినేడులో ఏరోస్పేస్ పార్కు రాబోతుందని, ఆదిబట్లలో మరిన్ని ఐటీ కంపెనీలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos