ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వ నివేదిక

ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వ నివేదిక

హైదరాబాద్ : రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె గురించి ప్రభుత్వం హైకోర్టుకు గురువారం నివేదిక సమర్పించింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఇన్‌ఛార్జ్‌ ఎండీ సునీల్‌ శర్మ నివేదికను సమర్పించారు. ప్రజా రవాణా కోసం 8,150 వాహనాలు అందుబాటులో ఉంచామని నివేదిక పేర్కొంది. వీటిలో 3013 ఆర్టీసీ, 1804 అద్దె, 696 ప్రైవేట్, 2,637 మ్యాక్సీ క్యాబ్‌లను నడుపుతున్నట్లు వివరించింది. తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లను నియమించినట్లు తెలిపింది. తమ విజ్ఞప్తి మేరకు మెట్రో రైలు అదనపు సర్వీసులు నడుస్తున్నాయని నివేదించింది. ప్రైవేట్ వాహనాలను స్టేజ్ క్యారియర్లుగా నడిపేందుకు అనుమతినిచ్చామని, మరిన్ని వాహనాలను అందుబాటులో ఉంచాలని ఓలా, ఉబర్లను కోరామని వివరించింది. సెట్విన్ బస్సుల ట్రిప్పులను పెంచామని పేర్కొంది. తెలంగాణకు అదనపు బస్సులు నడపాలని ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక ఆర్టీసీలను కోరినట్లు తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos