బెంగళూరు: కర్ణాటక మాజీ ఉపముఖ్యమంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్, మాజీ మంత్రి ఆర్.ఎల్.జాలప్ప విద్యా సంస్థలు, నివాసాలపై గురువారం ఉదయం ఆదాయపు పన్ను శాఖ అధికార్లు దాడులు జరిపారు. తుమకూరులో పరమేశ్వర్ , ఆయన సోదరుడు డాక్టర్ శివప్రసాద్కు చెందిన నూటికి పైగా విద్యా సంస్థలపై , జాలప్ప ఆధీనంలోని కోలారు సమీపంలోని టమక వద్ద ఉన్న దేవరాజ్ అర్స్ వైద్య కళాశాల, పరిశోధన సంస్థ కచ్చేరీలు, బ్యాంకు లాకర్లపై ఏక కాలంలో దాడులు జరిపారు. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. ఈ దాడులను కర్ణాటక మాజీ ముఖ్య మంత్రి, సీఎల్పీ నేత సిద్ధరామయ్య తీవ్రంగా ఖండించారు. కుట్రతోనే ఈ దాడులు నిర్వహించారని, ప్రజా సమస్యలను లేవనెత్తుతున్న వారిపై ప్రభుత్వం తన ప్రతాపం చూపిస్తోందని ట్విట్టర్లో వ్యాఖ్యానించారు.