లేడీ ఓరియంటెడ్ చిత్రంలో శ్రీముఖి..

  • In Film
  • October 10, 2019
  • 165 Views
లేడీ ఓరియంటెడ్ చిత్రంలో శ్రీముఖి..

ఎన్నో సినిమాలు,షోలు చేసినా దక్కని పాపులారీ శ్రీముఖికి బిగ్‌బాస్‌ షో ద్వారా దక్కింది.బిగ్‌బాస్‌లోకి ప్రవేశించాక శ్రీముఖికి చాలా మంది అభిమానులు తయారయ్యారు. దీంతో సహజంగానే క్రేజ్ కూడా రెట్టింపయింది.ఇది గుర్తించిన గౌతమ్ అనే దర్శకుడు శ్రీముఖి ప్రధాన పాత్రలో ఓ లేడీ ఓరియంటెడ్ చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమయ్యాడు. గౌతమ్‌తో పాటు సిద్దిపల్లి సూర్యనారాయణ,అల్లం సుభాష్ సహ నిర్మాతలుగా ఎయిమ్స్ మోషన్ పిక్చర్స్,ఎస్ ఎస్ ఎస్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, కాక్‌టెయిల్‌ సినిమాస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. సినిమాకు సంబందించి చిత్ర బృందం పోస్టర్ ని రిలీజ్ చేశారు.శ్రీ ముఖి గన్ పట్టుకొని ఉండగా పోస్టర్ కింద ఫైర్ ని పట్టుకోగలరా? అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు.డిఫరెంట్ థ్రిల్లర్ జానర్ లో రూపొందుతున్న ఈ లేడి ఓరియెంటెడ్ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ ని కూడా త్వరలో రిలీజ్ చేయనున్నారు. ఇక శ్రీ ముఖి బిగ్ బాస్ షో నుంచి బయటకు రాగానే షూటింగ్ ని స్టార్ట్ చేయనున్నారు. ఇక మరోవైపు పునర్నవి నటిస్తున్న సైకిల్ సినిమా ఫస్ట్ లుక్ ని కూడా ఇటీవల రిలీజ్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos