అమరావతి: రూ. 10 లక్షలకు పైగా విలువైన పనులు లేక కొనుగోళ్లకూ రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు తగిన విధి విధానాల ఖరారుకు ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే జనవరి నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తేవాలనేది ప్రభుత్వ ఆశయమని అధికార్లు తెలిపారు. ప్రభుత్వ కాంట్రాక్టులు, సర్వీసులు, కొనుగోళ్లలో పారదర్శకత, ప్రజాధనాన్ని ఆదా చేయటం దీని ఆశయమని వివరించారు. రూ. 100 కోట్లకు పైబడిన కాంట్రాక్టు పనులను ముందుగా జ్యూడిషీయల్ కమిటికి నివేదించిన తర్వాత ఖరారు చేస్తు న్నారు. ఈ విధానాన్ని మరింత పకడ్భందీగా అమలు చేయాలనీ జగన్మోహన రెడ్డి ఆదేశించారన్నారు. బిడ్డింగ్లో పాల్గొన్న మొదటి 60 శాతం మంది మాత్రమే రివర్స్ టెండరింగ్కు అర్హులయ్యేలా చూడాలన్నారు. ఇందు వల్ల బిడ్డింగ్లో వాస్తవికత ఏర్పడి రివర్స్ టెండరింగ్లో మరింత పోటీ పెరుగుతుందని చెప్పారు.